మానవాభివృద్ధి సూచికలో భారత్‌ది 130వ స్థానం

09/15/2018

దిల్లీ: ఐక్యరాజ్యసమితి తాజాగా ప్రకటించిన మానవాభివృద్ధి సూచిక(హెచ్‌డీఐ)లో భారత్‌ కనాకష్టంమీద ఒక్కస్థానం పైకి ఎగబాకింది. 189 దేశాలతో రూపొందించిన సూచికలో 130వ స్థానానికి పరిమితమైంది. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ వరుసగా 136, 150వ స్థానాల్లో నిలిచాయి. ఆసియా సగటు ‘హెచ్‌డీఐ’తో పోలిస్తే భారత్‌ 0.638 విలువతో కాస్త పైన ఉండటం ఊరట కలిగించే విషయం. 2016లో 0.624 విలువతో 131వ స్థానానికి పరిమితమైంది. ఆరోగ్యం, విద్య, మెరుగైన జీవన ప్రమాణాలే ప్రాతిపదికలుగా ఏటా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) ర్యాంకులు ప్రకటిస్తోంది.

Back to top